ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖలో జరిగిన దాడి నేపథ్యంలో ఆపరేషన్ గరుడ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గతంతో సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేకుండా దాడి జరిగే అవకాశం ఉందని ఆయన గతంలో గ్రాఫులతో సహా వివరించారు. దీని తర్వాత అల్లర్లు, రాష్ట్రపతి పాలన వస్తాయంటూ జోస్యం చెప్పారు. ఐటీ దాడులు, ఇప్పుడు జగన్‌పై దాడి… అన్నీ ఎంతో కొంత ఆపరేషన్ గరుడనే పోలి ఉండటంతో శివాజీ జోస్యంపై ఆసక్తి నెలకొంది. శివాజీ మాటల్లో ఆపరేషన్ గరుడ పూర్తి పాఠం చదవండి…