వైఎస్ జగన్‌తోపాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఏయే ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. 8వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. 151 స్థానాలు గెలవడంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలువురు సీనియర్లు, జూనియర్లు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు.
ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. జగన్ రాయలసీమలోని పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున కోస్తా, ఉత్తరాంధ్రల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఒకరిద్దరిని తీసుకునే అవకాశం లేకపోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఎన్నికల ప్రచార సభల్లోనే జగన్ ప్రకటించారు.
మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న కొందరి ఆశావహులు….
శ్రీకాకుళం నుంచి మాజీ మత్రి ధర్మాన ప్రసాదరావు, కళావతి, రెడ్డి శాంతి ఉన్నారు. విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీవాణి, రాజన్న దొర.
విశాఖపట్నం నుంచి గుడివాడ అమరనాధ్, గొర్లె బాబూరావు. తూర్పుగోదావరి నుంచి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, దాడిశెట్టి రాజా.
పశ్చిమ గోదావరి నుంచి ఆళ్ల నాని, తెల్లం బాలరాజు, తానేటి వనిత, గ్రంధి శ్రీనివాస్. కృష్ణా జిల్లా నుంచి పేర్ని నాని, ఉదయభాను, పార్థసారథి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు.
గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్(ఎమ్మెల్సీ కోటా), అంబటి రాంబాబు, కోన రఘుపతి.
ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్.
నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతంరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా.
కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాష. కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీదేవి, హఫఈజ్ ఖాన్. అనంతపురం నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, శంకర్ నారాయణ.
వీరిలో ఫైనల్‌గా మంత్రివర్గంలో ఎవరుంటారనేది తెలియాలంటే 8వ తేదీవరకు వేచి చూడాల్సిందే.