వైసీపీ – బీజేపీ – టీఆర్ఎస్ పొత్తు లేదా పరస్పర అవగాహన ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితులుగా అనేకమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా బి.పి.ఆచార్య, ఆదిత్యనాథ్ అనే ఐఏఎస్‌లపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతుంది. తాజాగా వీరిపై విచారణ జరపాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమని, ముందుగా అది తీసుకోవాలని సూచిస్తూ తెలంగాణ హైకోర్టు ఐద్దరు ఐఎఎస్‌లపై కేసులను కొట్టివేసింది.
ఇప్పుడు ఈడీ ఈ ఇద్దరు ఐఏఎస్‌లపై విచారణ జరపాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. దీనికి చాలా తతంగం ఉంటుంది. కేంద్ర సిబ్బంది, పరిపాలనా వ్యవహారాల శాఖ అనుమతి ఇవ్వాలి. ఇది బీజేపీ నేతృత్వంలోని వ్యవహారం కాబట్టి ఏం జరుగుతుందో ఊహించవచ్చు. గతంలో అనేక కీలకమైన కేసులను పరిశీలిస్తే… ముందుగా కింది వరుసలోని నిందితులను వదిలేయడం, తర్వాత పైస్థాయి నిందితులను వదిలేయడం జరిగింది. జగన్ కేసులో కూడా ఈడీ ఈ దిశగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది.
వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ పొత్తులో భాగంగానే ఈడీ కేసులను ప్రభుత్వం నీరుగారుస్తుందని టీడీపీ విమర్శించింది. ఆదరాబాదరాగా హైకోర్టును విభజించి జగన్ కేసులకు పక్కదారి పట్టించడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించింది.