చరిత్రలో ఈ రోజు – 2020 మార్చి, 29
సంఘటనలు
1857: ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది.
1982: తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు.
జననాలు
1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.
1952: కె.ఎన్.వై.పతంజలి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2009)
మరణాలు
1932: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు. (జననం.1885)
1953: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (జననం.1908)
1997 : భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్.
2016: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (జననం.1941).