లగడపాటి రాజగోపాల్ ఒక్కడే కాదండోయ్… ఆయన రెండో భార్య జానకీ రాజగోపాల్‌కు కూడా సర్వేల మీద మంచి ఇది ఉన్నట్టుంది. తన భర్త సర్వేను ఒప్పుకుంటూనే తన సొంత సర్వే లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తన లెక్క ప్రకారం అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇలా ఉంటాయట…
టీఆర్ ఎస్: 55-70 సీట్లు
ఎంఐఎం: 7 సీట్లు
కాంగ్రెస్: 35 – కొంచెం అటో ఇటో రావచ్చు.
టీడీపీ: 5-7 సీట్లు
బీజేపీ: 3-4 సీట్లు
ఇండిపెండెంట్లు: 2 సీట్లు (మిగతావి ఇతరులు…?)
అంతేకాదండోయ్.. ఎవరూ ఊహించని రీతిలో, ఊహించని అభ్యర్థలు ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు జానకీ రాజగోపాల్. కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలే లేచిపోతాయట ఈసారి.
చంద్రబాబును మాత్రం లగడపాటి సతీమణి ఆకాశానికెత్తేశారు. ఆయన వల్లే ప్రజాకూటమికి జీవం వచ్చిందట, శక్తి వచ్చిందట. అప్పటివరకు కాంగ్రెస్ రెస్ట్ పొజిషన్లోనే ఉందని చెప్పారు. అయితే చంద్రబాబు వల్ల తెలంగాణ సెంటిమెంట్ రూపంలో కొంత నష్టం కూడా జరిగిందంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ… తన భర్త సర్వేనే ఫైనల్ అనీ, దాన్ని తాను చాలెంజ్ చేయననీ చెప్పింది. మరి ఈ లెక్కలన్నీ ఎందుకు చెప్పినట్టో మరి. అంతేకాదు… మిజోరం, చత్తీస్ గఢ్, మద్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుస్తాయట.
సర్లే… అంతా బానే ఉంది కానీ, మిజోరాంలో బీజేపీ గెలుస్తుందనటమే శతాబ్దపు జోక్. ఇక చాలు మేడమ్. నవ్వాపుకోలేకపోతున్నం.