త‌మిళ అర్జున్ రెడ్డిలో జాన్వీ క‌పూర్

అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ త‌మిళ సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వ‌నుందా? తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించి హిట్ట‌యిన అర్జున్ రెడ్డి సినిమాను వర్మ పేరుతో త‌మిళంలో తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ పాత్ర ద్వారా జాన్వీ క‌పూర్ త‌మిళ తెరంగేట్రం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యిన ఈ సినిమా వివాదాల కార‌ణంగా మ‌ళ్లీ తీయ‌నున్నారు. ఇందులో జాన్వీకి అవ‌కాశం రానుంద‌ని స‌మాచారం.

janvi kapoor

ప్ర‌ముఖ హీరో విక్ర‌మ్ కొడుకు ధ్రువ్ త‌మిళ అర్జున్‌రెడ్డిగా న‌టిస్తున్నాడు. సినిమా అంతా పూర్త‌యి రిలీజ్ కాబోతున్న స‌మయంలో వివాదాల కార‌ణంగా మొత్తం ప్రాజెక్టు మొద‌టికొచ్చింది. వ‌ర్మ‌, అర్జున్‌రెడ్డి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంద‌ని నిర్మాత‌లు ఫీల‌వ‌డంతో సినిమా ఆగిపోయిన‌ట్టు స‌మాచారం. ద‌ర్శ‌కుడు బాలా కూడా సినిమా నుంచి త‌ప్పుకున్నారు. దీంతో మొత్తం వ్య‌వ‌హారం మొద‌టికొచ్చింది.

ఇందులో హీరోయిన్ పాత్ర ప‌ట్ల కూడా నిర్మాత‌లు సంతృప్తిగా లేర‌ట‌. ఆమె స్థానంలో జాన్వీ క‌పూర్‌ను పెట్టాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. సినిమా మొత్తాన్ని రీషూట్ చేసి జూన్‌లో విడుద‌ల చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. పింక్ త‌మిళ రీమేక్‌లో కూడా జాన్వీ న‌టిస్తున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. దీన్ని నిర్మాత బోనీక‌పూర్ ఖండించారు.