నా కొడుకుని డాక్ట‌ర్‌గా చూడాల‌నుంది: సానియా మీర్జా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇటీవ‌లే అబ్బాయి పుట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌హ‌జంగానే క్రీడాకారులు త‌మ పిల్ల‌ల‌ను కూడా పెద్ద క్రీడాకారులుగా చేయాల‌ని భావిస్తుంటారు. సానియా మీర్జా మాత్రం దీనికి భిన్నంగా త‌న కుమారుడిని త‌నలాగ టెన్నిస్ స్టార్ కాకుండా డాక్ట‌ర్‌ను చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పింది.

sania

సానియా మీర్జా డాక్ట‌ర్ కావాల‌నుకొని టెన్నిస్ క్రీడాకారిణి అయింద‌ట‌. అందుకే త‌న కుమారుడిని డాక్ట‌ర్‌గా చూడాల‌ని ఉంద‌ని పేర్కొంది. కోఠిలోని ఉస్మానియా మెడిక‌ల్ కాలేజ్‌లో 1980 బ్యాచ్ విద్యార్థుల స‌హ‌కారంతో ఏర్పాటైన సింథ‌టిక్ టెన్నిస్ కోర్టు, టెన్నిస్ అకాడ‌మీల‌ను సానియా మీర్జా ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేసింది.