మ‌ళ్లీ డెడ్లీ కాంబినేష‌న్ త‌ప్ప‌దా..?

విన‌య విధేయ రామ ఫ్లాప్ కావ‌డంతో త‌న ఆలోచ‌న‌లు, సినిమా తీసే విధానం ఈత‌రం హీరోల‌కు స‌రిప‌డ‌వ‌నే నిర్ణ‌యానికి బోయ‌పాటి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. దీనికితోడు రామ్ చ‌రణ్ త‌న ఫ్యాన్స్‌కు రాసిన‌ బ‌హిరంగ లేఖ‌తో బోయ‌పాటి శీను హ‌ర్ట్ అయిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. దీంతో బోయ‌పాటి మ‌ళ్లీ బాల‌య్య‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని స‌మాచారం. బోయ‌పాటే ఈ మ‌ధ్య దీన్ని ప్ర‌క‌టించ‌డం విశేషం.

బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో మాస్ డైరెక్ట‌ర్‌గా బోయ‌పాటికి పేరొచ్చింది. అయితే ఇత‌ర హీరోల‌తో, ముఖ్యంగా ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ హీరోల‌తో బోయ‌పాటి ఆలోచ‌న‌లు క‌నెక్ట్ కావ‌డం లేదు. దీనివ‌ల్ల అటు బోయ‌పాటి, ఇటు హీరోలు న‌ష్ట‌పోతున్నారు. విన‌య విదేయ రామ సినిమా అనుభ‌వం ఇదే క‌దా.

బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్ కోసం నంద‌మూరి ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండో భాగం కూడా పూర్త‌యినందువ‌ల్ల ఇక బోయ‌పాటి సినిమాకు లైన్ క్లియ‌రైన‌ట్టే. బోయ‌పాటి కూడా స్క్రిప్టు వ‌ర్క్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇది సిద్ధం కాగానే సినిమా ప్రారంభం కావ‌చ్చు. ఈ కాంబినేష‌న్ మ‌ళ్లీ హిట్ కొడ‌తారా లేదా అనేది చూడాలి.