బిగ్‌బాస్ సీజన్ 3 సిద్ధమవుతోంది. బిగ్‌బాస్ 1, 2 మంచి ప్రాచుర్యం పొందడంతో సీజన్ 3కి మా టీవీ సిద్ధమవుతోంది. దీనికోసం సెలబ్రిటీల ఎంపికకు మాటీవీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేకమందిని స్క్రీనింగ్ చేసినట్టు సమాచారం. బిగ్‌బాస్ సీజన్ 2 ఆశించినంతగా ఆదరణ పొందకపోవడంతో ఈసారి సెలబ్రిటీల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ను మళ్లీ హోస్ట్‌గా రంగంలోకి దింపనున్నారని సమాచారం. బిగ్‌బాస్ సీజన్ 1 కి హోస్ట్‌గా ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని హోస్ట్‌గా చేశారు. ఎన్టీఆర్‌వైపే ఎక్కువమంది మొగ్గుచూపడంతో మళ్లీ ఆయన్నే రంగంలోకి దించాలని మాటీవీ భావిస్తోంది.
అంతేగాక ఈసారి సెలబ్రిటీల్లో మరింత వైవిధ్యం చూపించాలని స్టార్ మా భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు కె.ఎ. పాల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. యూట్యూబ్ స్టార్ జాహ్నవి కూడా ఈసారి హౌస్‌మేట్‌లలో ఉండనుందట.