సూపర్ స్టార్ రజనీ మూవీ మేనియా మళ్లీ మొదలైంది. కాలా, 2.0, ఇప్పుడు పేట… క్రమం తప్పకుండా రజనీకాంత్ సినిమాలు వస్తుండటంతో అభిమానులకు పండగే. 2.0 తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం పేట. రజనీ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా తీశాడు కార్తీక్ సుబ్బారాజు.
రజనీ సినిమాల్లో బ్యాక్‌డ్రాప్ చాలా కామన్. ఫస్ట్ ఆఫ్‌లో సాదాసీదా హీరో, సెకండాఫ్‌లో అసలు హీరో. అసలు సిసలు రజనీ స్టయిల్ బ్యాక్‌డ్రాప్ కథలోనే ఉంటుంది. పేటలో కూడా ఇదే థీమ్. హాస్టల్ వార్డెన్‌గా కనిపించే కాళి అసలు కథే బ్యాక్‌డ్రాప్. అందులో కనిపించే వీర పేట పాత్ర రజనీని ఆవిష్కరిస్తుంది. రజనీ మార్కు నవ్వు, నడక, డైలాగ్‌లు వీర పేట పాత్రలో ఉంటాయి.
నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి సినిమాకు అదనపు బలం. త్రిష, సిమ్రాన్‌ల గురించి పెద్దగా చెప్పుకొనే అంశాలు లేవు. సినిమాలో ఎక్కువ భాగం హిల్ స్టేషన్‌లో తీయడంతో టెక్నికల్‌గా ఉన్నతంగా ఉంది సినిమా. కెమేరా వర్క్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.
సినిమా బలం:
రజనీ కాంత్ నటన, స్టయిల్
మొదటి ఆఫ్‌లో వినోదం
క్లయిమాక్స్‌లో వచ్చే ట్విస్ట్
బలహీనతలు:
రొటీన్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ
సెకండాఫ్‌లో అక్కడక్కడా సాగదీతలు
రజనీకాంత్ వయసుకు తగ్గ పాత్ర ఎంచుకోవడం గ్రేట్. భాషా సినిమా పోలికలు ఉన్నప్పటికీ, ఇప్పటి రజనీ, అప్పటి రజనీ ఎనర్జీ లెవెల్స్‌లో చాలా తేడా ఉంది. అందుకే పేటాను భాషాతో పోల్చలేం. అయితే ప్రయత్నం మాత్రం మళ్లీ రజనీ అభిమానులకు భాషాను గుర్తు చేస్తుంది. ఓవరాల్‌గా పూర్తిగా రజనీ కాంత్ సినిమా పేట.