జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన వైజాగ్ అమ్మాయి రష్మీ గౌతమ్ ఇంకా సినిమాల్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి సినిమాలు చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో వెండితెరపై మంచి పేరు తెచ్చుకోవాలన్న కల రష్మీకి ఇంకా నెరవేరలేదు. అందుకే ఒక అడుగు ముందుకేసి లిప్‌లాక్ ముద్దు సీన్లకు కూడా తాను సిద్ధమేననే సూచనలు డైరెక్టర్లకు పంపించింది.
ట్విట్టర్లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ మాటలు చెప్పింది. మీకు లిప్‌లాక్‌ల గురించి అడిగిన ప్రశ్నలకే స్పందిస్తున్నారు, ఇది డైరెక్టర్స్ చూసి అవకాశం ఇస్తారనేనా అని అభిమాని అడిగితే, రష్మీ దానికి స్పందిస్తూ తనకు నటన పట్ల కమిట్మెంట్ ఉందనీ, ఒకవేళ లిప్‌లాక్‌కు నేను ఒప్పుకుంటే అది చేస్తానని తెలిపింది. ఎవరైనా డైరెక్టర్లు స్పందిస్తారేమో చూద్దాం.