తన వయసుకు మించిన పాత్ర పోషించి రంగస్థలం సినిమా ద్వారా అందరినీ మెప్పించింది బుల్లితెర అనసూయ భరద్వాజ్. మంచి ఫామ్లో ఉన్నప్పుడు సాధారణంగా ఎవరూ వయసుకు మించిన పాత్రలు ఒప్పుకోరు. హీరోయిన్లు అసలు ఒప్పుకోరు. అలాంటిది అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర సాహసోపేతమైందే. దానికి అనసూయను అభినందించాల్సిందే. తాజాగా మరో సినిమాలో అనసూయ ఇలాంటి వైవిధ్య, సాహసోపేత పాత్ర చేయబోతుంది.
అనసూయ కీలక పాత్ర పోషిస్తున్న కథనం సినిమాలో అనసూయకు ఫైటింగ్లు కూడా ఉంటాయట. ఈ విషయాన్ని అనసూయ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు… ఇన్స్టాగ్రామ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. చిత్ర బృందం అనుమతితోనే ఈ వీడియోను అనసూయ లీక్ చేసింది. కొత్త పాత్రలో అనసూయ మరింత మందిని అభిమానులుగా మార్చుకుంటుందని ఆశిద్దాం.