మిథాలీ – హ‌ర్మ‌న్ ప్రీత్ వివాదానికి తెర‌

టీ20 ప్ర‌పంచ క‌ప్ కీల‌క సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో అనూహ్యంగా చోటు కోల్పోయిన మిథాలీ రాజ్ తిరిగి టీ20 జ‌ట్టులోకి ప్ర‌వేశించింది. న్యూజీలాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టును ఎంపిక చేసిన డ‌బ్ల్యు.వి. రామ‌న్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ మిథాలీని ఎప్ప‌టిలాగే టీ20 జ‌ట్టులోకి తీసుకుంది. దీంతో మిథాలీ టీ 20 కెరీర్‌పై వ‌చ్చిన ఊహాగానాల‌కు తెర‌ప‌డిన‌ట్ల‌యింది. టీ20 కెప్టెన్‌గా హ‌ర్మ‌న్ ప్రీత్‌నే కొన‌సాగించనున్నారు. దీంతో మిథాలీ – హ‌ర్మ‌న్ వివాదానికి దాదాపు తెర‌ప‌డిన‌ట్టే. ఫీల్డ్‌లో వీళ్ల‌ద్ద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఎలా ఉంటుంద‌నేది చూడాలి.

mithali and harman preet

భార‌త టీ 20 జ‌ట్టు (మ‌హిళ‌లు): హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, మిథాలీ రాజ్‌, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, అనూజ పాటిల్‌, హేమలత, మాన్సి జోషి, శిఖ పాండే, తానియా, పూనమ్‌ యాదవ్‌, ఏక్తా, రాధ యాదవ్‌, అరుంధతి రెడ్డి, ప్రియ పూనియా.

అలాగే న్యూజీలాండ్‌లో ప‌ర్య‌టించ‌నున్న వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్‌గా ఎప్ప‌టిలాగే మిథాలీ రాజ్ కొన‌సాగ‌నుంది. మిథాలీ నేతృత్వంలో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఆడ‌నుంది. దీంతో సెలెక్ట‌ర్లు వివాదానికి ముందున్న య‌థాత‌థ స్థితిని పున‌రుద్ధ‌రించార‌ని చెప్ప‌వ‌చ్చు. క‌లిసిక‌ట్టుగా ఆడి న్యూజీలాండ్ ప‌ర్య‌ట‌న‌ను అమ్మాయిలు విజ‌య‌వంతంగా ముగించాల‌ని ఆశిద్దాం.