వరుసగా ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్‌పై అంచనాలు పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కానుంది. దీనికి సంబంధించిన పాటలు, ట్రైలర్ కమ్ టీజర్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ రిక్షా తొక్కుతున్న ఫొటోను రిలీజ్ చేసింది.
సినిమాలో అనేక మంది టాలీవుడ్ నాయకా నాయికలు నటిస్తున్నారు. సుమంత్, కళ్యాణ్‌రామ్, ప్రకాష్‌రాజ్, దగ్గుబాటి రాణా, రకుల్ ప్రీత్ సింగ్, నిత్య మీనన్ మొదలైనవారు నటిస్తున్నారు. వీరంతా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దీన్ని హైదరాబాద్‌లో రిలీజ్ చేయనున్నారా లేక ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులో రిలీజ్ చేయనున్నారా అనేదానిపై స్పష్టత లేదు.
ఎన్టీఆర్ సినిమాకి సంగీతం ఎం.ఎం. కీరవాణి. మాటలు బుర్రా సాయిమాధవ్. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో రూపొందుతుంది. ఎన్టీఆర్ తన తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ఎన్టీఆర్ సినీ జీవితం నేపథ్యంలో సాగే మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.