స్వీటీ అనుష్క‌కి జ‌పాన్ అభిమానుల ప్ర‌త్యేక బ‌హుమ‌తి

అభిమానులు స్వీటీగా పిలుచుకునే అనుష్క‌కి ద‌క్షిణాదిలోనే కాదు… విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బాహుబ‌లి భారీ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనుష్క‌కి అభిమానులు ఏర్పడ్డారు. అందులో దేవ‌సేన‌గా అనుష్క న‌ట‌న ఆసియా వాసుల్ని, ముఖ్యంగా జ‌పాన్ ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది. ఈ అభిమానం సినిమా చూడ‌టం వ‌ర‌కే ఆగ‌లేదు.

జ‌పాన్‌లోని అనుష్క అభిమానులు స్వీటీకి ఇటీవ‌ల ప్ర‌త్యేక బ‌హుమ‌తి ఒక‌టి పంపించారు. స్వ‌యంగా త‌మ చేతుల‌తో వేసిన కొన్ని డ్రాయింగ్స్ అనుష్క‌కి పంపించారు. వాటిలో అనుష్క న‌టించిన వివిధ సినిమాల్లోని బొమ్మ‌లను గీశారు. కొన్ని కామిక్ టైప్ బొమ్మ‌లు కూడా ఉన్నాయి. స్వీటీ అనుష్క ఫ్యాన్ క్ల‌బ్ నుంచి అనుష్క‌కి ఆ బొమ్మ‌లు ఫార్వ‌ర్డ్ అయ్యాయి. అనుష్క ఆ బొమ్మ‌ల‌ను త‌న ట్విట‌ర్ అకౌంట్లో ఉంచి మురిసిపోయింది.

anushka kissing