హీరోయిన్గా కంటే రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాటతో జిగేల్ అంది పూజా హెగ్డే. తర్వాత వచ్చిన అరవింద సమేత కూడా మంచి హిట్ కావడంతో ఒక్కసారిగా అగ్రశ్రేణి తారల జాబితాలో చేరిపోయిందీ హీరోయిన్. సాధారణంగా దక్షిణాది ప్రేక్షకులకు కొంచెం బొద్దుగా ఉండే హీరోయిన్లే నచ్చుతారు. కానీ పూజా హెగ్డే మాత్రం బాగా సన్నగా ఉన్నప్పటికీ మంచి ఆదరణ పొందుతోంది. ఇంతకీ అంత సన్నగా ఉండటానికి కారణం ఏమిటంటే పూజా హెగ్డే చెప్పిన కారణం ఏమిటో తెలుసా…
మొదటి నుంచీ తాను సన్నగా ఉండేదట. సన్నగా ఉన్నా కదా అని వ్యాయామాలు ఎప్పుడూ ఆపేయలేదు. అసలు నా దృష్టిలో వ్యాయామం అనేది సన్నబడటానికి కాదు, ఫిట్‌గా ఉండటానికి అంటోంది పూజా. ఒక్కరోజు జిమ్ చేయకపోయినా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది… అందుకే రోజూ తప్పనిసరిగా జిమ్‌కు వెళ్తానంటోంది.
రోజూ ఒకే విధమైన వ్యాయామాలు చేసినా బోర్ కొడుతుంది. అందుకే కొత్త కొత్త ఎక్సర్సైజులు చేస్తానంటుంది. అలాగే ఎక్కువగా నీళ్లు తాగడం కూడా స్లిమ్‌నెస్ రహస్యం అంటోందీ బెంగళూరు అమ్మాయి. అయితే ఇందులో గొప్ప ఏమీ లేదనీ, ఇవన్నీ హీరోయిన్లు అందరూ చేయాల్సిందేనని, లేకపోతే లావైపోతారని అంటుంది.