చడీ చప్పుడు లేకుండా ఇదెప్పుడు జరిగిందా అనుకుంటున్నారా. ఇది నిజంగా రాజకీయాల్లో కాదులెండి. సినిమా రాజకీయాల్లోనే జరగబోతుందని సినిమా వర్గాల సమాచారం. రజనీకాంత్, ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి పాత్ర పోషించనున్నాడని తాజా అనధికార సమాచారం.
మురుగదాస్ సర్కార్ సినిమాలాగే, రజనీకాంత్ సినిమాలో కూడా కథానాయకుడు రాజకీయ నాయకుడే. ఈ సినిమా కథ గురించి ఎక్కడా లీక్ కాలేదు. ఈ చిత్రం గురించి వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. వచ్చే 2019 సంక్రాంతికి పెట్టాను విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
అందువల్ల పెట్టా తర్వాత రజనీ – మురుగదాస్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అయితే కథనం ప్రకారం రజనీ సీఎం పాత్ర పోషించడానికి మురుగదాస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.