2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్-2020) వాయిదా పడింది. పాత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఈ పరీక్ష జరగాలి. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో దీనిని వాయిదా వేసినట్టు అధికారిక సమాచారం. కాగా, పాలీసెట్ దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించారు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో తెలియజేస్తారు.
లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. మే 3 వరకు ఎలాంటి పరీక్షలు జరిగే అవకాశం లేదు. కొత్త షెడ్యూల్ మే 3 తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావచ్చు.