ఎన్‌టీఆర్ క‌థానాయ‌కుడు టైటిల్ సాంగ్ – దుర్యోధ‌నుడిగా బాల‌కృష్ణ‌

ఎన్‌టీఆర్ బ‌యోపిక్‌లో మొద‌టి పాట‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఎన్‌టీఆర్ సినీ జీవితంలో పోషించిన అనేక ప్ర‌ముఖ పాత్ర‌ల‌ను నేప‌థ్యంగా తీసుకొని శివ‌శ‌క్తి ద‌త్తా, డాక్ట‌ర్ కె. రామ‌కృష్ణ రాసిన – ఘనకీర్తిసాంద్ర… విజితాఖిలాంధ్ర, జనతాసుధీంద్ర మణిదీపకా… – అనే పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట సినిమా మొత్తానికి హైలైట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. పాట‌తోపాటు ఎన్‌టీఆర్ వేసిన ఆయా సినిమాల్లోని గెట‌ప్‌ల‌లో బాల‌కృష్ణ అల‌రించ‌డం ఖాయం. ఇప్ప‌టికే ఈపాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఎన్‌టీఆర్ సినిమా అభిమానుల కోసం ఈ పాట లిరిక్స్ ఇక్క‌డ ఇస్తున్నాం..