ఈమధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్‌లు సిగరెట్‌లు తాగడం, మందుకొట్టడం ట్రెండ్‌గా మారుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే ఈ ట్రెండ్ బాగా ఉంది. తెలుగు సినిమాల్లో కూడా ఇటీవల తరచుగా ఈ సీన్లు కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ సినిమా ట్యాక్సీవాలాలో కూడా హీరోయిన్ మందుకొట్టే సీన్‌లు ఉన్నాయి. ఆ అనుభవాలను సినిమా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గుర్తుచేసుకున్నారు.
మందు కొట్టే సీన్‌లు షూటింగ్ జరిగినన్ని రోజులూ తాను రోజూ వోడ్కాను మినిట్ మెయిడ్ జ్యూస్‌తో కలిపి తాగినట్టు చెప్పింది. మత్తు ఎక్కిన తర్వాత అలాగే షూటింగ్‌లో పాల్గొనే దాన్నని తెలిపింది. తన జీవితంలో మందు కొట్టడం అదే మొదటిసారని చెప్పుకొచ్చిందీ అనంతపురం అమ్మాయి. మత్తులో ఉన్నప్పుడు తన ప్రవర్తనలో మార్పులను కూడా చెప్పింది.
వోడ్కా మత్తులో ఉన్నప్పుడు ప్రియాంకా బాగా నవ్వేదట. షూటింగ్ స్పాట్‌లో చాలా సార్లు మత్తును హ్యాండిల్ చేయలేకపోయిందట. ఆ సీన్‌లు షూటింగ్ పూర్తయ్యాక మల్లీ వోడ్కా జోలికి పోలేదంటలెండి. కొత్త అమ్మాయి అయినా కానీ పాత్రలో ఒదిగిపోవడానికి పెద్ద సాహసమే చేసింది. తను మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటికీ స్థిరపడింది అనంతపురంలోనే. చదువు కూడా అనంతపురం, హైదరాబాద్‌లోనే సాగింది.