ఏపీ ముఖ్యమంత్రి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యాంశాలు:
1) మరింత పటిష్టంగా లాక్డౌన్ అమలు చేయనున్నాం.
2) అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతం పాటిస్తున్న సమయం కుదింపు చేయనున్నాం.
3) పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలకోసం అనుమతి ఉంటుంది.
4) మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతి ఉంటుంది.
5) నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
6) ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శన తప్పనిసరిగా పాటించాలి. అందులోనే ఫిర్యాదు చేయాల్సిన కాల్ సెంటర్ నంబర్ కూడా ఇవ్వాలి.
7) రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి.
8) గ్రామ వాలంటీర్లు సర్వే పటిష్టంగా ఉండాలి. ప్రతి కుటుంబం వివరాలు కూడా ఎప్పటికప్పుడు నమోదు కావాలి.
9) కోవిడ్ విస్తరిస్తున్న అర్బన్ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, అదనపు సిబ్బంది నియామకం చేస్తాం.
10) వ్యవసాయం, ఆక్వా, అనుబంధ రంగాల్లో సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.
11) రైతులకు, ఆక్వా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు అందాలి.
12) వలస కూలీలు, కార్మికులకోసం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలి
13) నిత్యావసరాలు, ఎమర్జెన్సీ, అత్యవసర సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూడాలి
14) ప్రతి జిల్లాలో మంత్రి ఆధ్వర్యంలో కోవిడ్ నిరవాణా చర్యల కోసం అధికారులతో సమావేశాలు నిర్వహించాలి.
15) అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమన్వయంకోసం అధికారులతో సమావేశాలు నిర్వహించాలి.