కరోనా వైరస్ వ్యాధి నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో భద్రత కల్పించే చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. అయితే అదే సమయంలో జర్నలిస్టులు కూడా తమ ఆరోగ్య భద్రత కోసం స్వీయ రక్షణతో కొన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మ రాజు చలపతిరావు తాజాగా హనుమాన్ జంక్షన్ , నెల్లూరులో పాత్రికేయులపై జరిగిన ఘటనలను ప్రస్తావించినప్పుడు డీజీపీ సవాంగ్ పైవిధంగా స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్లో జర్నలిస్టులు ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే ఏపీయూడబ్ల్యూజే లో అన్ని స్థాయిల నాయకులు కరోనా నివారణకు చేసే కృషిని వివరిస్తూ ప్రజలలో అవగాహన పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా డీజీపీకి వివరించడం జరిగింది. డీజీపీ పాత్రికేయులను ఈ సందర్భంగా అభినందించారు.