కరోనావైరస్ మహమ్మారి వల్ల ప్రజలు రోజూ బయటకు వెళ్లి పనిచేసుకోలేక సంపాదన లేక కూర్చుని ఉండమంటే వారి కుటుంబపోషణకు కష్టమవుతుందని, దీన్ని అవగాహన చేసుకొని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎంఎల్ఏ, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా వెల్లడించారు. రోజా వెల్లడించిన మరికొన్ని అభిప్రాయాలు:
1) మూడు నెలలకు సరిపోయే రేషన్ ప్రజలందరికీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. 29 మార్చిలో మొదటి విడత, ఏప్రిల్ 15న రెండో విడత, ఏప్రిల్ 29 వతేదీన మూడోవిడతగా రేషన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
2) ప్రతి వ్యక్తికి ఐదుకిలోలు బియ్యం, ప్రతి కార్డుకు కేజి కందిపప్పు చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. 58 లక్షలమంది పెన్షన్ దారులకు 1 వతేదీన పెన్సన్ ఇవ్వనున్నారు.
3) ఒక కోటి 40 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనున్నట్టు రోజా తెలిపారు.
4) ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్ నాలుగో తేదీన వేయి రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
ఈ నిర్ణయాలు వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాలను, చిత్తశుద్దిని ఈ నిర్ణయాలు తెలియచేస్తున్నాయని రోజా తెలిపారు. ఇంట్లో ఉండండి అని చెప్పడమే కాదు ఇంట్లో ఉన్నవారికి అన్ని అందుబాటులోకి తీసుకురావలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ చర్యలు:
కరోనా ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా సామాజిక దూరాన్ని పాటిస్తూ వాలంటీర్ల వ్యవస్ద ద్వారా పది మంది కార్డుదారులను తీసుకువచ్చి వారికి రేషన్ పంపిణి చేసి ఆ తర్వాత మరో పదిమందిని తీసుకువచ్చి రేషన్ అందిస్తున్నారు.
కరోనా వ్యాప్తి చెందకుండా చేయడమే కాకుండా పేదలకు నిత్యావసరవస్తువులు అందుబాటులోకి తీసుకురావడమనేది చాలా గొప్ప విషయం. దీంట్లో పోలీసులు చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగిన సంఘటనలు వీడియోలు పోస్టు చేసి పోలీసుల పరువు తీసి 24 గంటలు మన కోసం పనిచేసే పోలీసులను అవమానించవద్దు. వారు విసిగిపోతే కరోనా అందరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వాలు మన కోసం కష్టపడుతున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకోసం కష్టపడుతున్నారు కాబట్టే ఈ రోజు దేశంలోనే ఏపిలో తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయనే విషయం గుర్తించాలి.
లాక్ డౌన్ పాటిస్తూ బయటకు వెళ్లివచ్చే సందర్భంలో పరిశుభ్రత పాటిస్తూ కాళ్లు, చేతులు కడుగుకుని దుస్తులను సైతం హాట్ వాటర్ లో పెట్టాలి. ప్రతి ఒక్కరూ కూడా ఐదు పదినిముషాలకు ఒకసారి కొంచెం మంచినీరు తాగుతుండాలి.
@ Hello AP, 29 March 2020